టీఆర్ఎస్ ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష

ABN , First Publish Date - 2021-07-24T23:19:46+05:30 IST

టీఆర్ఎస్ ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష

టీఆర్ఎస్ ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష

హైదరాబాద్: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టులో చుక్కెదురు అయింది. ఆమెకు కోర్టు 6 నెలల జైలుతో్ పాటు రూ.10వేల జరిమానా విధించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పు వెల్లడించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే కోర్టు తీర్పుతో కవిత రూ.10వేల జరిమానా చెల్లించారు. దీంతో మాలోత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Updated Date - 2021-07-24T23:19:46+05:30 IST