‘సర్‌ రొనాల్డ్‌ రాస్‌ బిల్డింగ్‌’ పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-08-21T08:13:07+05:30 IST

వరల్డ్‌ మస్కిటో డే సందర్భంగా ‘సర్‌ రొనాల్డ్‌ రాస్‌ బిల్డింగ్‌’ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను తెలంగాణ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్‌ శుక్రవారం ఆవిష్కరించారు.

‘సర్‌ రొనాల్డ్‌ రాస్‌ బిల్డింగ్‌’ పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వరల్డ్‌ మస్కిటో డే సందర్భంగా ‘సర్‌ రొనాల్డ్‌ రాస్‌ బిల్డింగ్‌’ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను తెలంగాణ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఆడ అనాఫిలిస్‌ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాపిస్తుందని 1897 ఆగస్టు 20న రాస్‌ గుర్తించారు. రాస్‌ పరిశోధనా ఫలితాలను ప్రకటించిన ఆగస్టు 20ని వరల్డ్‌ మస్కిటో డే పరిగణిస్తున్నారు. మలేరియా జ్వరానికి కారణాలు కనుగొన్న భవనానికి ప్రభుత్వం సర్‌ రొనాల్డ్‌ భవనంగా నామకరణం చేసింది. పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T08:13:07+05:30 IST