ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: పిల్లి సుధాకర్

ABN , First Publish Date - 2021-08-04T01:53:48+05:30 IST

జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ

ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి: పిల్లి సుధాకర్

మహబూబాబాద్: జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఎస్సై శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాలు ధర్నా చేపట్టారు. దళిత ట్రైనీ ఎస్సైకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మరియమ్మ ఘటనను మరచిపోకముందే ఓ ట్రైనీ ఎస్సైపై, ఎస్సై శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి ఒడిగట్టడం శోషనీయమన్నారు. రాష్ట్రంలో ఒక దళిత ఎస్సైకే రక్షణ కరువైతే సామాన్యల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. దళిత బంధు కాదు.. దళితుల హక్కులను కాపాడాలని, నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని సుధాకర్ హెచ్చరించారు.

Updated Date - 2021-08-04T01:53:48+05:30 IST