షాపింగ్‌ మాల్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్న కస్టమర్లు

ABN , First Publish Date - 2021-12-26T13:09:57+05:30 IST

షాపింగ్‌ కోసం వచ్చిన కస్టమర్లు లిఫ్ట్‌లో చిక్కుకోవడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి వారిని

షాపింగ్‌ మాల్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్న కస్టమర్లు

కాపాడిన గౌలిగూడ ఫైర్‌ స్టేషన్‌ అధికారులు 

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: షాపింగ్‌ కోసం వచ్చిన కస్టమర్లు లిఫ్ట్‌లో చిక్కుకోవడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి వారిని రక్షించారు. ఈ ఘటన కాచిగూడలోని ఓ షాపింగ్‌ మాల్‌ లో శనివారం మధ్యాహ్నం జరిగింది. వినియోగదారులు మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో షాపింగ్‌ ముగించుకొని దాదాపు 10 మంది బేస్మెంట్‌లోని పార్కింగ్‌ స్థలం వద్దకు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. లిఫ్ట్‌ బిస్మెంట్‌ ఒకటి(బి1) వద్దకు రాగానే సాంకేతిక లోపంవల్ల మధ్యలో ఆగిపోయింది. దీంతో కస్టమర్లు ఆందోళనతో కేకలు వేశారు. కేకలను విన్న షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు గౌలిగూడ ఫైర్‌ స్టేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ ఆఫీసర్‌ ప్రేమ్‌రాజ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సునీల్‌, సిబ్బంది ఓంనమఃశివాయా, కిరణ్‌, నాగరాజు వెంటనే షాపింగ్‌ మాల్‌ వద్దకు చేరుకొని, లిఫ్ట్‌ పైకప్పును తొలగించి అందులో ఉన్న 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని మాపక సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. 

Updated Date - 2021-12-26T13:09:57+05:30 IST