Minister Sabitha ఇలాకాలో టీఆర్ఎస్కు ఊహించని షాక్...
ABN , First Publish Date - 2021-08-16T16:57:40+05:30 IST
Minister Sabitha ఇలాకాలో టీఆర్ఎస్కు ఊహించని షాక్ తగిలింది..
- టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి...
హైదరాబాద్ సిటీ/పహాడీషరీఫ్ : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం పరిధి జల్పల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ బుడుమల యాదగిరి, వార్డు మాజీ సభ్యుడు వై యాదగిరి తమ అనుచరులతో కలిసి ఆదివారం బీజేపీలో చేరారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు కపిల్‌గౌడ్, కౌన్సిలర్ ప్రశాంతి శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కౌన్సిలర్, తదితరులు కాషాయ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి. సుదర్శన్‌రెడ్డి, ధీరజ్‌రెడ్డి, కోలన్ శంకర్‌రెడ్డి, సాదక్ యాకుబ్, శేఖర్ గౌడ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.