యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శివసేనారెడ్డి

ABN , First Publish Date - 2021-01-09T07:38:59+05:30 IST

యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసికి దక్కింది. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డిని యూత్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికల కమిటీ గురువారం రాత్రి

యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా శివసేనారెడ్డి

పాలమూరు జిల్లా నుంచి ఎన్నికైన మూడో నేత


వనపర్తి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసికి దక్కింది. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన కొత్తకాపు శివసేనారెడ్డిని యూత్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికల కమిటీ గురువారం రాత్రి ప్రకటించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ను శుక్రవారం ఢిల్లీలో శివసేనారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్‌రెడ్డి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. శివసేనారెడ్డి మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గీతం యూనివర్సిటీలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ఆయన ఎన్‌ఎ్‌సయూఐలో పలు హోదాల్లో పనిచేశారు

Updated Date - 2021-01-09T07:38:59+05:30 IST