వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా: షర్మిల

ABN , First Publish Date - 2021-07-09T01:10:22+05:30 IST

వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా: షర్మిల

వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా: షర్మిల

హైదరాబాద్: ఇవాళ్టి నుంచి వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ షర్మిల తెలిపారు. కొత్త పార్టీని ప్రకటించిన ఆమె  ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పాదయాత్ర చేస్తానని చెప్పారు. వైఎస్సార్‌ టీపీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. సంక్షేమం కోసం పని చేసే రాజకీయ వేదిక అవుతుందని షర్మిల పేర్కొన్నారు. 


‘‘అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించినట్లు ఉద్యమకారుల్ని గుర్తిస్తాం. ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తాం. ఉద్యమకారులపై కేసులు ఇంత వరకు ఎత్తివేయలేదు. 1200 మంది ఉద్యమంలో చనిపోతే కేసీఆర్‌ కేవలం 400 మందినే గుర్తించారు. మైనార్టీలను బీజేపీ హేట్‌ బ్యాంక్‌గా చూపిస్తోంది. మైనార్టీలను కేసీఆర్‌ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. కేసీఆర్‌ అరచేతిలో వైకుంఠం చూపించారు.’’ అని షర్మిల విమర్శించారు. Updated Date - 2021-07-09T01:10:22+05:30 IST