శశాంక్ గోయల్‌ను కలవనున్న షర్మిల

ABN , First Publish Date - 2021-10-07T18:24:55+05:30 IST

మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్‌ను వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు

శశాంక్ గోయల్‌ను కలవనున్న షర్మిల

హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ శశాంక్ గోయల్‌ను వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కలవనున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నామినేషన్లపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు. హుజూరాబాద్ ఎన్నికలకు 200 మందితో ఇండిపెండెంట్‌లుగా నామినేషన్లు వేయించాలని వైఎస్సార్‌టీపీ యోచిస్తోంది. నిరుద్యోగుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌లు చేయిస్తున్నారని వైఎస్సార్‌టీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2021-10-07T18:24:55+05:30 IST