కోట్లాది రూపాయల ప్రజాధనంతో సీఎం పర్యటన: షబ్బీర్ అలీ

ABN , First Publish Date - 2021-06-22T00:36:04+05:30 IST

కోట్లాది రూపాయల ప్రజాధనంతో సీఎం పర్యటన: షబ్బీర్ అలీ

కోట్లాది రూపాయల ప్రజాధనంతో సీఎం పర్యటన: షబ్బీర్ అలీ

కామారెడ్డి: టీఆర్ఎస్ కార్యకర్తలను కలవడానికే కోట్లాది రూపాయల ప్రజాధనంతో సీఎం పర్యటన చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మీడియాను ఒక గదిలో బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. బహిరంగసభ సాక్షిగా వాగ్దానంచేసి యూటర్న్ తీసుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. 800 కోట్లు ఖర్చు చేసి గోదావరి జలాలను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని గుర్తుచేశారు. 200 కోట్లు ఇస్తే కాళేశ్వరం పూర్తవుతుందని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. లక్షా 20 వేల కోట్లు ఖర్చుచేసి సిద్దిపేట, ఫార్మ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-06-22T00:36:04+05:30 IST