అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా మసీద్, దేవాలయం కూల్చారు: షబ్బీర్ అలీ

ABN , First Publish Date - 2021-12-08T19:27:18+05:30 IST

అర్థరాత్రి ఎవరికి తెలియకుండా సచివాలయంలో మజీద్, దేవాలయం కూల్చారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా మసీద్, దేవాలయం కూల్చారు: షబ్బీర్ అలీ

హైదరాబాద్ : అర్థరాత్రి ఎవరికి తెలియకుండా సచివాలయంలో మజీద్, దేవాలయం కూల్చారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త సచివాలయం నిర్మాణంలో మసీద్ దెబ్బతిన్నదనీ అందుకే కుల్చామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారన్నారు. కొడుకు కేటీఆర్‌ను సీఎం చేసేందుకే సచివాలయం వాస్తు మార్పులు చేశారన్నారు. దాని కోసమే కొత్త సచివాలయం నిర్మాణమని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.సచివాలయంలో మసీదు ఉన్న స్థలంలోనే తిరిగి కొత్తది నిర్మించాలని డిమాండ్ చేశారు. 1947కి ముందు ఉన్న మసీద్ నిర్మాణాలను కుల్చవద్దని 1991 పార్లమెంట్ చట్టం ఉందన్నారు. దాని ప్రకారం పాత మసీద్ స్థానంలో కొత్తది నిర్మించకుంటే కేసీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు అవుతుందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్టు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-08T19:27:18+05:30 IST