వన్యప్రాణి మాంసం స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-19T05:55:47+05:30 IST

వన్యప్రాణి మాంసం స్వాధీనం

వన్యప్రాణి మాంసం స్వాధీనం

వెంకటాపురం(నూగూరు), అక్టోబరు 18: మండలంలోని పాత్రాపురం గ్రామ సమీపంలో అడవి జంతువు మాంసాన్ని ఫారెస్టు అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.  మండలకేంద్రం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడానికి ఆర్టీసీ బస్సులో అడవి జంతువు మాంసం తరలిస్తున్నారనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్త మయ్యారు. బస్సును వెంబడించి తనిఖీ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అడవి జంతువు మాంసం లభ్యమైంది. దీంతో మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. దీనిపై  విచారణ చేపడుతున్నామని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-10-19T05:55:47+05:30 IST