సిద్దిపేటలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2021-10-31T22:07:28+05:30 IST

పట్టణంలో అక్రమంగా నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా

సిద్దిపేటలో గుట్కా ప్యాకెట్లు పట్టివేత

సిద్దిపేట: పట్టణంలో అక్రమంగా నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గుట్కా,అంబర్ ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారంతో కాటన్ మార్కెట్ యార్డ్ సమీపంలోని ఒక రూమ్‌పై టాస్క్‌ఫోర్స్, టూ టౌన్ పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో సుమారు మూడు లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-31T22:07:28+05:30 IST