రూ.40 లక్షల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత

ABN , First Publish Date - 2021-05-18T08:06:32+05:30 IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం తొండుపల్లి వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి నకిలీ విత్తనాలు తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు.

రూ.40 లక్షల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత

శంషాబాద్‌, మే 17 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం తొండుపల్లి వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి నకిలీ విత్తనాలు తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని కర్నూల్‌ జిల్లా పాణ్యం నుంచి మేడ్చల్‌కు ఈ విత్తనాలను తరలిస్తున్నట్టు శంషాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తొండుపల్లి వద్ద మాటు వేసి మినీ ట్రక్కును పట్టుకున్నారు. విత్తనాల విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.


Updated Date - 2021-05-18T08:06:32+05:30 IST