సంగారెడ్డి జిల్లాలో గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-31T21:23:49+05:30 IST

జిల్లాలో అమ్మకానికి సిద్దంగా ఉంచిన గంజాయిని పోలీసులు

సంగారెడ్డి జిల్లాలో గంజాయి స్వాధీనం

సంగారెడ్డి: జిల్లాలో అమ్మకానికి సిద్దంగా ఉంచిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసారు. అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని చెరువు కట్టపై గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంలో అబ్కారీ అధికారులు దాడి చేసారు. ఏపీ రాష్ట్రంలోని క్రిష్ణా జిల్లా పెందుర్రుకు చెందిన ఇసాక్ అనే వ్యక్తిని అదుపులోకి అబ్కారీ అధికారులు తీసుకున్నారు. అతడి వద్ద 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మదీనాగూడలో ఉంటూ బాచుపల్లిలో గది అద్దెకు తీసుకుని నిల్వ ఉంచినట్లు నిందితుడు తెలిపాడు.  అక్కడ గదిలో కూడా 3.5 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-10-31T21:23:49+05:30 IST