అక్క ఆత్మీయత

ABN , First Publish Date - 2021-12-26T05:21:48+05:30 IST

అక్క ఆత్మీయత

అక్క ఆత్మీయత
గన్‌మెన్ల సన్మాన కార్యక్రమంలో కంటతడి పెడుతున్న ఎమ్మెల్యే సీతక్క

బదిలీపై వెళ్తున్న గన్‌మెన్ల వీడ్కోలు సభలో  కంటతడి పెట్టిన సీతక్క  

ములుగు, డిసెంబరు 25: ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క కంటతడి పెట్టారు. తన అంగరక్షకులు బదిలీ కావడంతో వారికి వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆప్యాయతను చూసి అంగరక్షకులు కూడా కంటతడి పెట్టారు.  రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గత మూడేళ్లుగా సునీల్‌, భాస్కర్‌, సురేందర్‌రెడ్డి అనే కానిస్టేబుళ్లు సీతక్కకు గన్‌మెన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జోనల్‌ బదిలీల్లో భాగంగా వారు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఈ క్రమం లో శుక్రవారం రాత్రి ములుగులోని క్యాంపు కార్యాలయంలో వారిని సీతక్క సన్మానించి నూతన వస్ర్తాలు బహూకరించారు. ఎమ్మెల్యే, గన్‌మెన్‌లా కాకుండా కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారని, తనను సొంత సోదరిలా చూసుకున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.  విభిన్నమైన పరిస్థితుల నుంచి రాజకీయంలోకి వచ్చిన తనను ఏనాడూ ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా చూసుకున్నారని కన్నీ రుకార్చారు. కరోనా కష్టకాలంలో పేదలకు సాయం చేసేందుకు ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా వెంట వచ్చి చేయూతనందించారని తెలిపారు. సీతక్క ఆప్యా యతకు కరిగిపోయిన ఆ కానిస్టేబుళ్లు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, టీపీసీసీ నాయకుడు పైడాకుల అశో క్‌కుమార్‌, మండల అధ్యక్షుడు ఎమ్డీ.చాంద్‌పాషా, యూత్‌కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్‌, చంద్రమౌళి, తిరుపతిరెడ్డి, మర్రి రాజుయాదవ్‌, రేవంత్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:21:48+05:30 IST