సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ రీ ఓపెన్!
ABN , First Publish Date - 2021-08-13T19:16:06+05:30 IST
పాఠశాలల రీ ఓపెన్ విషయమై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులకు తెలంగాణ స్వస్తి చెప్పి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను నిర్వహించనుంది.
హైదరాబాద్: పాఠశాలల రీ ఓపెన్ విషయమై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులకు తెలంగాణ స్వస్తి చెప్పి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను నిర్వహించనుంది. అయితే ఇది పిల్లలందరికీ వర్తించదు. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. స్టేటస్ రిపోర్ట్‌ను సీఎం కేసీఆర్‌కు విద్యాశాఖ పంపించింది. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని... విద్యార్థులకు ప్రమాదం లేదని సీఎంకి అధికారులు నివేదిక అందించారు. పలు రాష్ట్రాల్లో తరగతుల ప్రారంభంపై సీఎం దృష్టికి విద్యాశాఖ తీసుకెళ్లింది. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని విద్యాశాఖ చెబుతోంది. స్కూళ్లు తెరవమని ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించింది. రేపు లేదా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది.