అటెండెన్స్ అంతంత మాత్రమే..
ABN , First Publish Date - 2021-02-02T04:23:54+05:30 IST
అటెండెన్స్ అంతంత మాత్రమే..

పునఃప్రారంభమైన పాఠశాలలు
తొలి రోజు 31 శాతమే హాజరు ఠ కొవిడ్ నిబంధనల మేరకు తరగతులు
భూపాలపల్లిటౌన్, ఫిబ్రవరి 1: పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా ప్రభావంతో మూతపడిన బడులు సోమవారం మళ్లీ తెరుచుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు కొవిడ్ నిబంధనలు అనుసరించి తరగతులను ప్రారంభించాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, హాస్టళ్లను కలుపుకుని మొత్తం 7,975 మంది విద్యార్థులు ఉండగా తొలిరోజు 2,474 మంది మాత్రమే హాజరయ్యారు. 31 శాతమే హాజరు నమోదైంది. ఉపాధ్యాయులు మాత్రం వంద శాతం హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 69 ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతిలో 1,481 మంది విద్యార్థులకు 516 మంది హాజరయ్యారు (34.84 శాతం). పదో తరగతిలో 1,585 మంది విద్యార్థులకు 767 మంది హాజరయ్యారు (48.39 శాతం). ఆరు మోడల్ స్కూళ్లలో తొమ్మిదో తరగతిలో 564కు 115 మంది (20.39 శాతం), పదో తరగతిలో 572 మంది విద్యార్థులకు 235 మంది (41.08 శాతం), 11వ తరగతిలో 538కు 144 మంది (26.77 హాజరు శా తం) , 12వ తరగతిలో 538కు 30 మంది (5.58 శాతం) మాత్రమే హాజరయ్యారు. 11 కేజీబీవీల్లో మొత్తం ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. తొమ్మిదో తరగతిలో 318 మంది ఉండగా ఇద్దరు, పదోతరగతిలో 357లో ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. 11, 12వ తరగతుల్లో విద్యార్థులెవరూ హాజరుకాలేదు. అలాగే 37 ప్రైవేటు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు 862 మంది ఉండగా 250 మంది (29 శాతం), పదో తరగతిలో 855 మందికి 410 మంది (47.95 శాతం) హాజ రయ్యారు.
పటిష్ట చర్యలు
కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలనే విద్యా శాఖ ఆదేశాల మే రకు పాఠశాలల యాజమాన్యాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. తరగతి గదు లు, మరుగుదొడ్లు శుభ్రం చేయించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల చేతులు శానిటైజ్ చేశాకే తరగతి గదుల్లోకి అనుమతించాయి. మాస్కులు ధరించకుం డా ప్రవేశం లేదని ముందుగానే అప్రమత్తం చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిబంధనను పాటించారు. తరగతి గదుల్లో విద్యార్థులను పా ఠశాల యాజమాన్యాలు భౌతిక దూరంలో కూర్చొబెట్టాయి. చేతులు శానిటైజ్ చేసి, ఆ తర్వాత సబ్బుతో కడిగాకే మధ్యాహ్న భోజనానికి అనుమతించారు.