నేటి నుంచి మోగనున్న బడిగంట
ABN , First Publish Date - 2021-02-01T06:25:26+05:30 IST
నేటి నుంచి మోగనున్న బడిగంట

విద్యాసంస్థల్లో శానిటైజింగ్ పూర్తిచేసిన యాజమాన్యాలు
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, జనవరి 31 : లాక్‌డౌన్ అనంతరం చాలారోజుల తర్వాత విద్యాశాఖ నేటి నుంచి పాఠశాలలను ప్రారంభి స్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇప్పటికే అన్ని పాఠశాలల యాజమాన్యా ల కొవిడ్ నిబంధనల మేరకు పాఠశాలల్లో శానిటైజింగ్ ప్రక్రియను పూర్తిచేశాయి. దీంతో 9 నుంచి ఆపై తరగ తుల విద్యార్థులకు నేటి నుంచి ప్రత్యక్ష బోధన సాగనుంది. జిల్లా వ్యాప్తంగా 238 పాఠశాలల్లో 9, 10వ తరగతులకు సంబంధించి 18673 మంది విద్యార్థులు హాజ రుకానున్నారు. విద్యార్థులు భౌతికదూరంతో పాటు మాస్క్‌లు ధరించాలని డీఈ వో సోమశేఖరశర్మ సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు శానిటైజర్‌ను అం దజేశారు. పాఠశాలలు, కళాశాలల్లో కలిపి 21560 మంది విద్యార్థులు తరగతుల కు హాజరు కానున్నారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయా విద్యాసంస్థలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.