వరంగల్: తెరుచుకున్న పాఠశాలలు, కళాశాలలు
ABN , First Publish Date - 2021-02-01T15:20:59+05:30 IST
వరంగల్ జిల్లా: పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.

వరంగల్ జిల్లా: పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో తరగతులు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రతి బెంచ్‌పై ఒకే విద్యార్థి కూర్చునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5,118 పాఠశాలలు, 502 కళాశాలు(ఇంటర్,డిగ్రీ, ఇంజనీరింగ్) కళాశాలలు తెరుచుకున్నాయి.