గుస్సాడి నృత్యం అభివృద్ధికి కనకరాజు ఎంతో కృషి చేశారు: సత్యవతి రాథోడ్

ABN , First Publish Date - 2021-02-01T19:40:06+05:30 IST

హైదరాబాద్: గుస్సాడి నృత్యం అభివృద్ధికి కనకరాజు ఎంతో కృషి చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

గుస్సాడి నృత్యం అభివృద్ధికి కనకరాజు ఎంతో కృషి చేశారు: సత్యవతి రాథోడ్

హైదరాబాద్: గుస్సాడి నృత్యం అభివృద్ధికి కనకరాజు ఎంతో కృషి చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన నృత్యానికి ఇంత గొప్ప పురస్కారం రావడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో పాటు పడుతుందన్నారు. కనకరాజుకి పద్మశ్రీ పురస్కారం రావడం ద్వారా తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు.ఇప్పటికే గిరిజనుల కోసం హైదరాబాద్‌లో మ్యూజియంను ఏర్పాటు చేశామని సత్యవతి రాథోడ్ తెలిపారు. 


Updated Date - 2021-02-01T19:40:06+05:30 IST