కూలి పనుల్లో సర్పంచ్‌...

ABN , First Publish Date - 2021-03-24T06:00:33+05:30 IST

కూలి పనుల్లో సర్పంచ్‌...

కూలి పనుల్లో సర్పంచ్‌...
తోటి కూలీలతో ఉపాధిహామీ పనులు చేస్తున్న సర్పంచ్‌ అనిత

భీమదేవరపల్లి, మార్చి 23: ఇంట్లో సరుకులు లేకపోవడంతో ఓ సర్పంచ్‌ ఉపాధిహామీ కూలి పనికి వెళ్తోంది. మండలంలో నూతనంగా ఏర్పడిన విశ్వనాథకాలనీ సర్పంచ్‌ వల్లెపు అనిత.. కిందటేడు శ్మశానవాటిక నిర్మాణం పనులు చేపట్టింది. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు శ్మశాన వాటిక వద్ద సామగ్రి, సిమెంట్‌ బస్తాలు, ఇనుపరాళ్లు, ఇనుము కొట్టుకుపోయాయి. సుమారు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకపోవడంతో ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. దీంతో వారం రోజులుగా కూలి పనులకు వెళ్తోంది.


 

Updated Date - 2021-03-24T06:00:33+05:30 IST