నాటాసారా తరలింపులో సర్పంచ్ అరెస్ట్?
ABN , First Publish Date - 2021-02-28T01:49:50+05:30 IST
నిషేధిత నాటుసారాను తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు
సూర్యాపేట: నిషేధిత నాటుసారాను తరలిస్తూ ఎక్సైజ్ పోలీసులకు సర్పంచ్ చిక్కాడు. ఈ ఘటన మోతె మండలంలో జరిగింది. మండలంలోని గోపతండాలో నాటుసారా, నల్లబెల్లం తరలిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు గ్రామంలో మాటు వేశారు. సారా, బెల్లంను వాహనంలో తరలిస్తుండగా సర్పంచ్ తిరుపతిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సర్పంచ్‌తో పాటు మరో వ్యక్తి కూడా పోలీసులకు చిక్కాడు. ఇన్నోవాలో తరలిస్తున్న 30 లీటర్ల నాటుసారా, 500 కేజీల నల్లబెల్లం, 25 కేజీల పటికను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.