త్వరలో సారస్వత పరిషత్తు పురస్కారాల ప్రదానం

ABN , First Publish Date - 2021-02-01T08:49:39+05:30 IST

తెలంగాణ సారస్వత పరిషత్తు కొత్త కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు అందజేయనుందని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య ఆదివారం ఓ ప్రకటనలో

త్వరలో సారస్వత పరిషత్తు పురస్కారాల ప్రదానం

ఉత్తమ సాహిత్య గ్రంథాల రచయితలకు అందజేత


అఫ్జల్‌గంజ్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సారస్వత పరిషత్తు కొత్త కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు అందజేయనుందని పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లకాలంలో వివిధ ప్రక్రియల్లో మొదటిసారిగా ముద్రితమైన గ్రంథాలను సేకరించి, పరిశీలించి పురస్కారాలను త్వరలో అందజేస్తామన్నారు. అలాగే, తెలంగాణ భాష, సాహిత్యం, కళా సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన ఐదుగురు ప్రముఖులను విశిష్ట పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. యువతీయువకులను ప్రోత్సహించే ఉద్దేశంతో రెండు యువ పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు.

Updated Date - 2021-02-01T08:49:39+05:30 IST