ప్రైవేటు బడుల్లోనూ శానిటైజేషన్‌: ట్రస్మా

ABN , First Publish Date - 2021-01-20T08:07:30+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే, ప్రైవేట్‌ స్కూళ్లలోనూ శానిటైజేషన్‌ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల

ప్రైవేటు బడుల్లోనూ శానిటైజేషన్‌: ట్రస్మా

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే, ప్రైవేట్‌ స్కూళ్లలోనూ శానిటైజేషన్‌ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. జీవో-46 ప్రకారం ఇతర చార్జీలను వసూలు చేయకూడదని ఆదేశించినందున శానిటైజేషన్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సంఘం రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు శేఖర్‌ రావు, మధుసూదన్‌ మంత్రిని మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జీవో-46 ప్రకారం ఫీజులు చెల్లించేలా చూడాలని, విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరాన్ని జూలై-31 వరకు పొడిగించాలని, మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని వారు మంత్రిని కోరారు.

Updated Date - 2021-01-20T08:07:30+05:30 IST