కాంగ్రెస్‌ హయాంలో భారీగా నిధులు వచ్చేవి: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-11-29T04:29:16+05:30 IST

కాంగ్రెస్‌ హయాంలో స్థానిక సంస్థలకు నిధులు భారీగా వచ్చేవని, కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల విలువ కేసీఆర్‌కు తెలుస్తుందని...

కాంగ్రెస్‌ హయాంలో భారీగా నిధులు వచ్చేవి: జగ్గారెడ్డి

సంగారెడ్డి: కాంగ్రెస్‌ హయాంలో స్థానిక సంస్థలకు నిధులు భారీగా వచ్చేవని, కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల విలువ కేసీఆర్‌కు తెలుస్తుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని హరీష్‌రావు ఇప్పుడు అందరికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉండటంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆనందంగా ఉన్నారని జగ్గారెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-11-29T04:29:16+05:30 IST