ప్రభుత్వాల మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తాం..
ABN , First Publish Date - 2021-12-30T18:13:26+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైతులు పండించిన ప్రతి గింజను కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ అన్నారు.

మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌రావు
గార్ల, డిసెంబరు 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైతులు పండించిన ప్రతి గింజను కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం గార్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు ద్వంద విధానాలు పాటిస్తూ రైతులను పక్కదారి పట్టించడం సరైంది కాదన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావూరి వెంకట్రామయ్య, తాళ్ళపల్లి కృష్ణగౌడ్, రూపాబాయి, చిలకబాబు, జాస్తీ సత్యనారాయణ, సాగర్‌బాబు, షంషాద్‌బేగం, గాజుల కృష్ణ, జహర్‌లాల్ పాల్గొన్నారు.