స్టాళ్లలో అధిక ధరలపై ఆర్టీసీ ఎండీ కొరడా

ABN , First Publish Date - 2021-10-19T08:54:27+05:30 IST

బస్‌ స్టేషన్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న వారిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కొరడా ఝుళిపించారు. పలు దుకాణాలతో ఆర్టీసీ చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేయడంతోపాటు జరిమానా విధించారు.

స్టాళ్లలో అధిక ధరలపై ఆర్టీసీ ఎండీ కొరడా

స్‌ స్టేషన్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న వారిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కొరడా ఝుళిపించారు. పలు దుకాణాలతో ఆర్టీసీ చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేయడంతోపాటు జరిమానా విధించారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్‌ స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. ఇదే అదనుగా కొందరు షాపుల నిర్వాహకులు ధరలను ఇష్టానుసారం వసూలు చేయడంతోపాటు నకిలీలను కూడా ప్రయాణికులకు అమ్ముతున్నారని ఫిర్యాదులు అందడంతో సజ్జనార్‌ వెంటనే రంగంలోకి దిగారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సూర్యాపేట, నల్గొండ , కరీంనగర్‌, వరంగల్‌, హన్మకొండ బస్‌ స్టేషన్లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించారు. ఉచిత మరుగుదొడ్లకు డబ్బులు తీసుకొంటున్న.. ఎక్కువ ధరలకు అమ్ముతున్న.. నకిలీ బ్రాండ్‌లతో వస్తువులు విక్రయిస్తున్న వారికి రూ.52వేల జరిమానా విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎండీ హెచ్చరించారు. 

Updated Date - 2021-10-19T08:54:27+05:30 IST