రాజ్యాంగబద్ధత లేని ఆర్వోఆర్ చట్టం!
ABN , First Publish Date - 2021-10-28T08:59:15+05:30 IST
తెలంగాణ భూమిహక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టానికి(నూతన ఆర్వోఆర్ చట్టం) రాజ్యాంగబద్ధత లేదని పేర్కొంటూ...

కాంగ్రెస్ నేత రాజనర్సింహ పిల్
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ భూమిహక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టానికి(నూతన ఆర్వోఆర్ చట్టం) రాజ్యాంగబద్ధత లేదని పేర్కొంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆర్వోఆర్ రాజ్యాంగబద్ధతపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలనశాఖ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ చట్టంలోని పలు సెక్షన్లు ప్రాథమిక, రాజ్యంగహక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కాంగ్రెస్ నేత సీ దామోదర రాజనర్సింహ హైకోర్టులో పిల్ వేశారు.