ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు

ABN , First Publish Date - 2021-02-07T05:29:20+05:30 IST

ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు

ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు
మహబూబాబాద్‌-నర్సంపేట జాతీయ రహదారిని దిగ్బంధించిన వామపక్ష, కాంగ్రెస్‌ నేతలు

అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధనం 


మహబూబాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 6 : ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా, వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్రప్రభుత్వ మెండివైఖరిని నిరసిస్తూ మానుకోట జిల్లా వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారులను దిగ్బంధించారు. జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్‌ వద్ద వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఎన్‌హెచ్‌ 365పై ఆందోళనకు దిగారు. గంటకు పైగా రాస్తారోకో చేశారు. వామపక్ష, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బి. విజయసారఽథి, సాదుల శ్రీనివాస్‌, డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌, మండల వెంకన్న, పాయం చిన్న చంద్రన్న, దేశెట్టి రాంచంద్రయ్య, భూతం వీరన్న, ఎస్కే. సైదులు మాట్లాడుతూ.. 72 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు ఆందోళన చేస్తుంటే కేంద్ర పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రోడ్లపై మేకులు కొట్టి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని ఆరోపించారు. కార్పొరేట్‌ శక్తులకు మేలు చేసే రైతు చట్టాలను రద్దు చేసే వరకు అన్నదాతలకు మద్దతుగా పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ పాలకులు దేశద్రోహులుగా మిగిలిపోతారని విమర్శించారు. ఆయా పార్టీల నేతలు బి.అజయ్‌, పెరుగుకుమార్‌, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, సమ్మెట రాజమౌళి, గుజ్జు దేవేందర్‌, జగ్గన్న, పైండ్ల యాకయ్య, రేషపల్లి నవీన్‌, చింతకుంట్ల వెంకన్న, నక్క నాగార్జున,  కుమ్మరికుంట్ల నాగన్న, అనసూర్య, గాడిపెల్లి ప్రమీల, మామిండ్ల సాంబలక్ష్మి, శాగంటి భాగ్యమ్మ, బానోత్‌ ప్రసాద్‌, నీరుటి లక్ష్మినారాయణ, దల్‌సింగ్‌, ఖలీల్‌పాషా పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీడీపీ మానుకోట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కొండపల్లి రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. 




Updated Date - 2021-02-07T05:29:20+05:30 IST