గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2021-12-28T13:24:37+05:30 IST

గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్ట్‎ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో యువకుడి పరిస్థితి విషమంగా

గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి

పెద్దపల్లి: గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్ట్‎ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గోదావరిఖనిలోని రమేష్ నగర్‎లో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకులు మహేందర్, శివరామరాజుగా పోలీసులు గుర్తించారు. యువకులు మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-28T13:24:37+05:30 IST