రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..ముగ్గురి పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2021-12-28T12:46:26+05:30 IST

రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన

రంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..ముగ్గురి పరిస్థితి విషమం

రంగారెడ్డి: రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. AP 13N 5121 కారులో మొత్తం 5 మంది యువకులు, ఒక అమ్మాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మితిమీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-12-28T12:46:26+05:30 IST