టైరు ఊడి.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు
ABN , First Publish Date - 2021-07-25T12:22:24+05:30 IST
కారు టైరు ఊడిపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందకు..
హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్ : కారు టైరు ఊడిపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చౌటుప్పల్ వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డు వద్దకు రాగానే వెనుక టైరు ఊడిపోయింది. దాంతో రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది.