23, 24న హుజూరాబాద్‌లో రేవంత్‌ రోడ్‌షో

ABN , First Publish Date - 2021-10-21T09:17:27+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక రచిస్తోంది.

23, 24న హుజూరాబాద్‌లో రేవంత్‌ రోడ్‌షో

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రణాళిక రచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 23, 24 తేదీల్లో రోడ్‌ షో నిర్వహించనున్నారు. పరిస్థితిని బట్టి 25వ తేదీనా ఆయన ప్రచారం కొనసాగే అవకాశం ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఇప్పటికే అక్కడ వెంకట్‌ తరపున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్‌ వి.హన్మంతరావు సైతం గురువారం నుంచి ప్రచారం చేయనున్నారు.

Updated Date - 2021-10-21T09:17:27+05:30 IST