30న శాయంపేటకు రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-26T05:24:44+05:30 IST

30న శాయంపేటకు రేవంత్‌రెడ్డి

30న శాయంపేటకు రేవంత్‌రెడ్డి

 ప్రజలతో ‘రచ్చబండ’

హనుమకొండ సిటీ, డిసెంబరు 25 : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఈ నెల 30న జిల్లాలోని శాయంపేట మండలకేంద్రానికి రానున్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి శాయంపేటలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రేవంత్‌రెడ్డి రాక క్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు రచ్చబండ కార్యక్రమంపై దృష్టి సారించారు. ప్రజలతో ముఖాముఖిగా రేవంత్‌రెడ్డి రచ్చబండను నిర్వహిస్తుండడం పార్టీని పటిష్ఠం చేస్తుందనే అభిప్రాయాలను కాంగ్రెస్‌ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. 

 

Updated Date - 2021-12-26T05:24:44+05:30 IST