67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా!: రేవంత్

ABN , First Publish Date - 2021-11-23T20:04:52+05:30 IST

కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రే స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు

67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా!: రేవంత్

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రే స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రిగారు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. రైతుబీమా పథకం 59 ఏళ్ల వయస్సు లోపు వారికే వర్తింస్తుంది కనుక, సదరు 67 వేల పైచిలుకు చావులు సహజ మరణాలు కానట్టే కదా!’’ అని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T20:04:52+05:30 IST