రేవంత్‌రెడ్డికి.. కేటీఆర్‌తో పోలికా?

ABN , First Publish Date - 2021-10-21T09:12:47+05:30 IST

మంత్రి కేటీఆర్‌తో పోల్చుకునే స్థాయి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి అన్నారు.

రేవంత్‌రెడ్డికి.. కేటీఆర్‌తో పోలికా?

బ్లాక్‌మెయిలింగ్‌లో ఆయనతో పోటీ పడలేం: ఎ.జీవన్‌రెడ్డి

మంత్రి కేటీఆర్‌తో పోల్చుకునే స్థాయి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్టీఏ దరఖాస్తులు, బ్లాక్‌మెయిలింగ్‌లో తాము రేవంత్‌తో పోటీ పడలేమని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఓ సైకో.. డ్రగ్‌ అడిక్ట్‌ అని, ఆయనకు దమ్ముంటే ఆర్మూరులో తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. నిజామాబాద్‌ ఎంపీ స్టంట్‌ మాస్టర్‌ అయితే.. మల్కాజిగిరీ ఎంపీ టెంట్‌ మాస్టర్‌ అంటూ ఎద్దేవా చేశారు.  కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే నిజామాబాద్‌ మహిళలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. కేసీఆర్‌పై ఇక్కడి ప్రతిపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని, జగన్‌ తరహాలో తామూ ప్రవర్తిస్తే.. 30 సార్లు దాడి చేయాల్సి వచ్చేదని అన్నారు.  


టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ తరఫున నామినేషన్లు

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ ఆయన తరఫున పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, జడ్పీ చైర్మన్లు బుధవారంనామినేషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివా్‌సరెడ్డికి వారు నామినేషన్‌ పత్రాలు అందించారు. 

Updated Date - 2021-10-21T09:12:47+05:30 IST