హరీశ్‌, ఈటల తోడుదొంగలు

ABN , First Publish Date - 2021-10-28T09:06:30+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ల వ్యవహారశైలి దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటున్నట్లుందని ..

హరీశ్‌, ఈటల తోడుదొంగలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

హుజూరాబాద్‌, అక్టోబరు 27: ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ల వ్యవహారశైలి దొంగలు దొంగలు కలిసి గట్లు పంచుకుంటున్నట్లుందని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తమ పెత్తనం, ఆధిపత్యం ప్రదర్శించడానికే ఈ ఉపఎన్నిక తీసుకొచ్చారన్నారు.  కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు బడేమియా, ఛోటేమియా అని, ఇద్దరూ ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకున్నారని, ఇద్దరూ తోడు దొంగలేనన్నారు. అప్పుడు ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ తరపున కత్తి దూసి కాంగ్రె్‌సపైకి వచ్చారని, ఇప్పుడు వారిద్దరి మధ్య దళిత భూముల పంపకాల పంచాయతీ వచ్చి విడిపోయి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తెచ్చారని పేర్కొన్నారు.


ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో మొదటి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ కోసం 1569 మంది ప్రాణత్యాగం చేస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈటల ఏ రోజైనా అడిగారా అని ప్రశ్నించారు.  బల్మూరి వెంకట్‌ను కొందరు అనామకుడని అంటున్నారని, ఈ అనామకుడిని చూసి టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయన్నారు. వారి వద్ద డబ్బులు తీసుకుని కాంగ్రె్‌సకు ఓటెయ్యాలని కోరారు. కాంగ్రె్‌సను గెలిపిస్తే ఇద్దరినీ నిలదీస్తుందన్నారు. ఈ ఉప ఎన్నికపై నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్‌ కూడా ఆధారపడి ఉందన్నారు.

Updated Date - 2021-10-28T09:06:30+05:30 IST