తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-25T23:35:55+05:30 IST

రాష్ట్రంలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలను నిషేధించింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో భౌతికదూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోజు నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒమైక్రాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-12-25T23:35:55+05:30 IST