22 నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్ట్‌ల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-08-21T08:19:12+05:30 IST

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వికారాబాద్‌-పర్లి సెక్షన్‌లో హైదరాబాద్‌-పూణె మధ్య నడిచే హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు(నంబర్‌ 07653, 07654) ఆదివారం నుంచి 11 స్టేషన్లలో హాల్ట్‌లను పునరుద్ధరిస్తున్నారు.

22 నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్ట్‌ల పునరుద్ధరణ

హైదరాబాద్‌,  ఆగస్టు 20( ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వికారాబాద్‌-పర్లి సెక్షన్‌లో హైదరాబాద్‌-పూణె మధ్య నడిచే హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు(నంబర్‌ 07653, 07654) ఆదివారం నుంచి 11 స్టేషన్లలో హాల్ట్‌లను పునరుద్ధరిస్తున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌-పూణె మార్గంలో సదాశివపేట్‌, కోహిర్‌, మటల్‌కుంట, ఖానాపూర్‌, హల్‌బర్గ, కల్గుపూర్‌, హర్‌, చాకుర్‌, జన్వాల్‌, పంగాన్‌, ఘట్నాందూర్‌లలో రైళ్ల రాకపోకల సమయంలో నిమిషం పాటు నిలపనున్నట్టు వివరించారు.

Updated Date - 2021-08-21T08:19:12+05:30 IST