‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై ఇసుక మాఫియా దాడి

ABN , First Publish Date - 2021-10-31T08:39:13+05:30 IST

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో విధి నిర్వహణలో ఉన్న ‘‘ఆంధ్రజ్యోతి’’ సీనియర్‌ విలేకరి రవీందర్‌గౌడ్‌పై ఇసుక అక్రమ రవాణాదారులు దాడికి దిగారు.

‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై ఇసుక మాఫియా దాడి

అక్రమ రవాణాపై ఫొటోలు తీస్తుండగా దౌర్జన్యం

పెబ్బేరు రూరల్‌, అక్టోబరు 30: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో విధి నిర్వహణలో ఉన్న ‘‘ఆంధ్రజ్యోతి’’ సీనియర్‌ విలేకరి రవీందర్‌గౌడ్‌పై ఇసుక అక్రమ రవాణాదారులు దాడికి దిగారు. రాంపురం గ్రామం వద్ద కృష్ణానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని శనివారం సమాచారం రావడంతో  రవీందర్‌గౌడ్‌ అక్కడికి వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించగా తిరస్కరించారు. దీంతో ‘మమ్మల్నే ఫొటోలు తీస్తావా’ అంటూ సెల్‌ఫోన్‌ను లాక్కొని ఛాతీపై దాడి చేశారు. సత్యనారాయణరెడ్డి అనే ట్రాక్టర్‌ యజమాని దాడి చేయగా హర్షవర్ధన్‌రెడ్డి దుర్భాషలాడాడు. ఈ విషయంపై స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో రవీందర్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-10-31T08:39:13+05:30 IST