‘దళితబంధు’పై ఈసీకి నివేదిక

ABN , First Publish Date - 2021-10-20T08:10:33+05:30 IST

‘దళితబంధు’పై ఈసీకి నివేదిక

‘దళితబంధు’పై ఈసీకి నివేదిక

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలో  దళితబంధు అమలు తీరుపై ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌ మంగళవారం భారత ఎన్నికల సంఘా (ఈసీఐ)నికి  నివేదిక పంపారు. హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్ల ద్వారా హుజూరాబాద్‌ పరిధిలో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య, నిలిపివేసేందుకు తీసుకున్న చర్యలను అందులో వివరించారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు జరపకుండా చూడాలని కలెక్టర్లకు, సంబంధిత విభాగాలకు సూచించినట్లు అందులో పేర్కొన్నారు. దీంతోపాటు ఆయా పార్టీలు పరస్పరం చేసుకున్న ఆరోపణలు, ఫిర్యాదులను కూడా ఈసీకి నివేదించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-20T08:10:33+05:30 IST