సూర్యాపేటలో రెమ్‌డెసివిర్‌ ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-05-20T22:09:05+05:30 IST

సూర్యాపేటలో రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ 3,500 విలువైన ఇంజెక్షన్లను

సూర్యాపేటలో రెమ్‌డెసివిర్‌ ముఠా అరెస్ట్‌

సూర్యాపేట: సూర్యాపేటలో రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ 3,500 విలువైన ఇంజెక్షన్లను 35 వేలకు కేటుగాళ్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో 12 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దందాలో ఇద్దరు బీజేపీ నేతలను కీలక నిందితులుగా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లో ఏ1 మాధవరెడ్డి, ఏ2 కార్తిక్‌రెడ్డి పేర్లను చేర్చారు. రూ.3500 విలువైన ఒక్కో రేమిడిసివర్ ఇంజక్షన్‌ను పది రెట్లకు పైగా విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఆస్పత్రులు మొత్తం కరోనా రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. 

Updated Date - 2021-05-20T22:09:05+05:30 IST