టీఎస్ఆర్‌జేసీ సెట్‌-2021 ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2021-06-24T09:08:03+05:30 IST

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎ్‌సఆర్‌జేసీసెట్‌) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

టీఎస్ఆర్‌జేసీ సెట్‌-2021 ఫలితాల విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీల కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎ్‌సఆర్‌జేసీసెట్‌) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రవేశపరీక్షలు నిర్వహించకుండా పదో తరగతిలో సాధించిన గ్రేడ్ల ఆధారంగా జిల్లాలవారీగా విద్యార్థుల్ని ఇంటర్‌ మొదటి సంవత్సరం (ఆర్ట్స్‌, సైన్స్‌)కు ఎంపిక చేశారు. ఫలితాలు, అడ్మిషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం www.tswreis.in ,www.tswreis.ac.in  వెబ్‌సైట్లను చూడాలని సొసైటీ  కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ప్రాథమికంగా ఎంపికైన విద్యార్థులు వారికి కేటాయించిన కాలేజీల్లో తమ సర్టిఫికెట్లు ఈ నెల 25 నుంచి జూలై 5లోపు సమర్పించాలన్నారు. కాగా, తెలంగాణలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష జూలై 18న నిర్వహించనున్నట్లు ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. పరీక్షకు వారం రోజుల ముందు గురుకుల సొసైటీ వెబ్‌సైట్ల నుంచి హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-06-24T09:08:03+05:30 IST