దళితబంధు నిధుల విడుదల

ABN , First Publish Date - 2021-12-22T01:59:11+05:30 IST

రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు దళిత బంధు

దళితబంధు నిధుల విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలోని  నాలుగు జిల్లాలకు దళిత బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిధులను  తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ విడుదల చేసింది. సూర్యాపేట జిల్లా తిరుమల్‌గిరి మండలానికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి రూ.100 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలానికి రూ.50 కోట్లను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలానికి రూ.50 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. నాలుగు జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో నిధులను ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జమ చేసింది.

Updated Date - 2021-12-22T01:59:11+05:30 IST