‘ఎర్రకోట ఘటనకు మా పార్టీకి సంబంధం లేదు’

ABN , First Publish Date - 2021-02-06T12:39:25+05:30 IST

వారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో

‘ఎర్రకోట ఘటనకు మా పార్టీకి సంబంధం లేదు’

హైదరాబాద్/రాంగోపాల్‌పేట్‌ : గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన సంఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అఖిల్‌ భారతీయ పరివార్‌ పార్టీ జాతీయ అడ్వయిజరీ కమిటీ సభ్యులు, అస్సోం సమన్వయకర్త ఏఎఫ్‌ ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనల వెనక అఖిల్‌ భారతీయ పరివార్‌ పార్టీ హస్తముందని తప్పుడు వార్తలను ప్రసారం చేసిన ఛానల్‌ వాటిని నిరూపించాలని, లేదా తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు ఈ నెల 7వ తేదీలోపు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో 8వ తేదీ నుంచి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త, జాతీయ అడ్వయిజరీ కమిటీ సభ్యులు అభయ్‌వర్మ మాట్లాడారు. సమావేశంలో జాతీయ నాయకులు పూజా భారతీయ్‌, తుషార్‌ కాంతిరాయ్‌ భారతీయ్‌, లోక్‌సభ నాయకుడు సల్లావుద్దీన్‌ భారతీయ్‌, మహ్మద్‌ భారతీయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T12:39:25+05:30 IST