ఆ ఉపాధ్యాయుల దరఖాస్తులను మళ్లీ పరిశీలించండి

ABN , First Publish Date - 2021-12-30T07:13:37+05:30 IST

సీనియారిటీ, ఆరోగ్యం, ఇతర అంశాల ప్రాతిపదికన కేటాయింపులు

ఆ ఉపాధ్యాయుల దరఖాస్తులను మళ్లీ పరిశీలించండి

  • కేటాయింపులపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
  • టీచరు దంపతులకు మళ్లీ ఆప్షన్లు!
  • ఒకే జిల్లాలో విధుల్లో కొనసాగడానికి వీలుగా అధికారుల కసరత్తు

 

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సీనియారిటీ, ఆరోగ్యం, ఇతర అంశాల ప్రాతిపదికన కేటాయింపులు జరపాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉపాధ్యాయుల దరఖాస్తులను తాజాగా మళ్లీ పరిశీలించాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. తమ అభ్యంతరాలను పరిశీలించకుండా కేటాయింపులు చేశారని పేర్కొంటూ పలువురు ఉపాధ్యాయులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అభినందన్‌ కుమా ర్‌ షావిలి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. పిటిషనర్ల విజ్ఞప్తులను డీఈవోలు ప్రభుత్వానికి పంపాలని హైకోర్టు తెలిపింది. జీవో 317 మార్గదర్శకాలకు అనుగుణంగా హెల్త్‌, సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ మేరకు పిటిషనర్ల ఆప్షన్లను మళ్లీ పరిశీలించాలని  పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియను మూడురోజుల్లో పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని పిటిషన్లపై వాదనలను ముగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 


Updated Date - 2021-12-30T07:13:37+05:30 IST