ఆర్‌వోఎఫ్‌ఆర్ దరఖాస్తులు స్వీకరించండి: హైకోర్టు
ABN , First Publish Date - 2021-11-28T08:50:55+05:30 IST
అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజన పోడు వ్యవసాయదారుల నుంచి ఆర్‌వోఎ్‌ఫఆర్ హక్కులు గుర్తించడానికి దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజన పోడు వ్యవసాయదారుల నుంచి ఆర్‌వోఎ్‌ఫఆర్ హక్కులు గుర్తించడానికి దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎటువంటి క్లయిమ్ చేయని, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలేని వారి నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రనాగారానికి చెందిన మాది సాయిబాబు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి ధర్మాసనం.. ఆర్‌వోఎ్‌ఫఆర్ రూల్స్ 2008 ప్రకారం దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశాలు జారీచేసింది.