అది రాజ్యాంగంపైనే దాడి: రావుల

ABN , First Publish Date - 2021-10-21T10:07:11+05:30 IST

‘‘చంద్రబాబును మెప్పించాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి..

అది రాజ్యాంగంపైనే దాడి: రావుల

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబును మెప్పించాలంటే అభివృద్ధిలో పోటీ పడాలి. అదే వైసీపీ నాయకుడిని మెప్పించాలంటే ప్రతిపక్షాల నేతలు, కార్యాలయాలపై దాడులు చేయాలేమో!’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అమరావతిలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ పాల్పడిన దుశ్చర్యను ఏ భాషలో ఖండించాలో కూడా తెలియట్లేదని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి కేవలం టీడీపీపై దాడి కాదని, ప్రజలు, రాజ్యాంగం, భావప్రకటన స్వేచ్ఛలపై అని వ్యాఖ్యానించారు. ఇక్కడి ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2021-10-21T10:07:11+05:30 IST