పవర్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా రత్నాకర్‌రావు

ABN , First Publish Date - 2021-12-28T07:50:07+05:30 IST

తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌

పవర్‌ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా రత్నాకర్‌రావు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పి.రత్నాకర్‌రావు ఎన్నికయ్యారు. రెండేళ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు. అసోసియేషన్‌లో 4,410 మంది సభ్యులు ఉండగా... అందులో 3,902 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అసోసియేట్‌ అధ్యక్షుడిగా పి.వెంకట నారాయణరెడ్డి, సెక్రటరీ జనరల్‌గా పి.సదానందం, అదనపు సెక్రటరీ జనరల్‌గా కె.అంజయ్య ఎన్నికయ్యారు.


యూనియన్‌ ట్రాన్స్‌కో ఉపాధ్యక్షుడిగా బి.భాస్కర్‌రావు, కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్‌, సంయుక్త కార్యదర్శిగా పి.శశికాంత్‌, జెన్‌కో విభాగం ఉపాధ్యక్షుడిగా పి.వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఎన్‌.సురేశ్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శిగా సి.హెచ్‌.నరేశ్‌ను సభ్యులు ఎన్నుకున్నారు. ఎస్పీడీసీఎల్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా బి.శ్రీనివా్‌సరెడ్డి, కార్యదర్శిగా జె.ఎల్‌.జనప్రియ, సంయుక్త కార్యదర్శిగా బి.యుగంధర్‌, ఎన్పీడీసీఎల్‌ విభాగం ఉపాధ్యక్షుడిగా వై.రాంబాబు, కార్యదర్శిగా బి.సామ్యానాయక్‌, సంయుక్త కార్యదర్శిగా టి.కిరణ్‌ ఎన్నికయ్యారు. అధ్యక్ష, కార్యదర్శులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం ఈ సందర్భంగా మాట్లాడారు. ఓటింగ్‌లో పాల్గొన్న ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-12-28T07:50:07+05:30 IST