మార్కెట్‌ పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2021-12-30T18:16:12+05:30 IST

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఒక రైతు పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం కలిపి తీసుకురావడంతో వ్యాపారులు అవాక్కయ్యా రు.

మార్కెట్‌ పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం

కేసముద్రం, డిసెంబరు 29 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ఒక రైతు పత్తి బస్తాల్లో రేషన్‌ బియ్యం కలిపి తీసుకురావడంతో వ్యాపారులు అవాక్కయ్యా రు. గూడూరు మండ లం అప్పరాజుపల్లికి చెందిన ఒక రైతు 35 బస్తాల పత్తిని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చా డు. ఈ పత్తిని 19 బస్తాలు ఒక చోట, 16 బస్తాలు మరో చోట వేసి రెండు లాట్లు తీసుకున్నాడు. ఈ-నామ్‌ విధానంలోని ఈ-వేలంలో సాయి శ్రీనివాస ట్రెడింగ్‌ కంపెనీ, విజయలక్ష్మి కాటన్‌మిల్లు ఈ సరుకును దక్కించుకున్నాయి. తొలుత విజయలక్ష్మి కాటన్‌ మిల్లు వద్ద ఈ పత్తి బస్తాలను ఇతర ప్రాంతానికి ఎగుమతి చేసేందుకు లారీలో లోడింగ్‌ చేసేందుకు బస్తాను హమాలీలు కోశారు. దీంతో బియ్యం బయటపడడంలో అవాక్కయ్యారు. సదరు రైతు తీసుకువచ్చిన 16 బస్తాల్లో ప్రతీ బస్తాలో 2 నుంచి 4కిలో ల బియ్యం ఉన్నట్లు వ్యాపారులు గుర్తించారు. దీంతో యార్డులోనే ఉన్న మరో లాట్‌లోని 19 బస్తాలను మరో వ్యాపారి పరిశీలించగా అందులోనూ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అన్ని బస్తాల్లో కలిపి సుమారు క్వింటాపైగా బియ్యం కలిపినట్లు వ్యాపారులు తెలిపారు. మానవతా దృక్పథంతో మరోసారి తప్పు చేయకుండా ఉంటాననే హామీతో రైతును వదిలిపెట్టినట్లు వ్యాపారులు తెలిపారు.

Updated Date - 2021-12-30T18:16:12+05:30 IST